పేటలో 82.41శాతం పోలింగ్‌

పాయకరావుపేట నియోజకవర్గం

పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్

లుసమయం ముగిసినా కొనసాగిన పోలింగ్‌

దోసలపాడులో వేకువజాము వరకు ఓటింగ్‌

లుప్రజాశక్తి -నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సోమవారం జరిగిన 82.41 శాతం పోలింగ్‌ నమోదయింది .పాయకరావుపేట నియోజకవర్గం నాలుగు మండలాల్లో మొత్తం 2,50,744 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,23,363, మహిళలు 1,27,379, ఇతరులు ఇద్దరు ఉన్నారు.సోమవారం జరిగిన ఎన్నికల్లో పురుషులు 1,02, 464, మహిళలు 1,04,161, ఇతరులు ఒక్కరు ఓటేయగా, మొత్తం 2,06,626 మంది ్ల ఓటు హక్కును వినియోగించుకున్నారు.పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి, పాయకరావుపేట ఎస్‌ రాయవరం, కోట ఊరట్ల మండలాల్లో 292 పోలింగ్‌ కేంద్రాలు గలవు.పోలింగ్‌ ప్రారంభం నుండి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మండలంలోని దోసలపాడు పోలింగ్‌ కేంద్రంలో మంగళవారం తెల్లవారుజాము 3 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది .పోలింగ్‌ కేంద్రంలో పోలింగ్‌ ఆలస్యంగా జరగడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నక్కపల్లి, ఉపమాక, వెదుళ్ళ పాలెం తదితర గ్రామాల్లో సోమవారం రాత్రి సుమారుగా 10 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. కొన్ని గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ ప్రక్రియ నెమ్మదిగా జరిగినప్పటికీ, ఓటర్లు మొక్కవోని దీక్షలో క్యూలైన్లలో వేచియుండి ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. పలు గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద టెంట్లు ఏర్పాటు చేసినప్పటికీ చాలక పోవడంతో మండుటెండను సైతం లెక్కచేయకుండా నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఉపమాకలో సమయం దాటిన తర్వాత క్యూలో ఉన్న ఓటర్

➡️