9వ రోజుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-కాకినాడతమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు 9వ రోజు సమ్మె శిబిరంలో వంటా వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. సమ్మె శిబిరానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు హాజరై మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎవరి ప్రమేయం లేకుండానే కడుపుకాలి సమ్మె పోరాటంలోకి వచ్చారని, జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే సమ్మె చేయాల్సి వచ్చిందని చెప్పారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నా పార్ట్‌ టైం, డైలీ వేజ్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వమే సమగ్ర శిక్ష ఉద్యోగులను శ్రమదోపిడీ చేస్తుంటే పోరాడక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 70 శాతం అక్షరాస్యత సాధించడంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల పాత్ర కీలకమైందని, తక్షణం సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ బేష రతుగా రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా నాట్యమండలి కళాకారులు ఉద్యమ గీతాలు ఆలపించి సమ్మెకు మద్దతు తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వా శేషబాబ్జి, చెక్కల రాజ్‌కుమార్‌, కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, పోలాత్తుల శ్రీనివాస్‌ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారులు కృష్ణ, రొంగల వీర్రాజు, జుత్తుగ శ్రీను, విజరు కుమార్‌, ఎం.చంటిబాబు, సత్య నాగమణి, జెఎసి జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఎ.లోవరాజు, సహాయ కార్యదర్శులు జి.నారాయణ, శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారి పి.రాజు, ఎం.గంగాధర్‌, రాధాకృష్ణ నాయకత్వం వహించారు.

➡️