మసీదు ముత్తవల్లీల మౌలిక వసతులపై చర్చ

Feb 8,2024 15:45 #Tirupati district

ప్రజాశక్తి-కోట(తిరుపతి) : మండల పరిధిలోని శ్యామసుందర పురం గ్రామంలో ఉన్న మసీదులో గూడూరు నియోజకవర్గ మసీదు ముత్తవల్లీల కమిటీ చైర్మన్‌ షేక్‌.మొబిన్‌ భాష ఆధ్వర్యంలో గూడూరు డివిజన్‌ స్థాయిలో ఉండే ముత్తవల్లీలతో సమీక్ష సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా వక్స్బోర్డు ఇన్స్పెక్టర్‌ అలీభారు హాజరయ్యారు. మొట్టమొదటగా దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడే ముస్లింలతో చర్చించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డివిజన్‌ పరిధిలో ఉండే 82 మసీదుల ముత్తవల్లీలు మౌలిక వసతులు,నిధులు, వనరులు, తదితర లాంటి సమస్యలను అలీభారు దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం అలీ భారు ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని ముత్తవల్లీలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గం మసీదు ముత్తవల్లీల కమిటీ చైర్మన్‌ షేక్‌.మొబిన్‌ బాషా,వైస్‌ చైర్మన్‌ రహీం,జాయింట్‌ సెక్రెటరీ అమీర్‌,మస్తాన్‌ భాష,రియజ్‌,మౌలా,నజీర్‌, అమీరుద్దీన్‌,ఇస్మాయిల్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️