అనారోగ్య కారణాలతో ఉరి వేసుకుని వ్యక్తి మృతి

Jun 20,2024 09:16 #perikapalem

ప్రజాశక్తి -అద్దంకి( బాపట్ల జిల్లా) : కుటుంబ కలహాలు ,అనారోగ్య కారణాలతో పట్టణం లోని పెరికపాలెం సమీపంలో జీవనము కొనసాగిస్తున్న కత్తుల శేషు (55) బుధవారం అర్ధరాత్రి గుండ్లకమ్మ బ్రిడ్జిపై ఉన్న సిమెంట్‌ దిమ్మెకు తాడు కట్టుకొని ఉరి వేసుకుని మఅతి చెందిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. గతంలో లారీలు నడుపుతూ జీవనం సాగించేవాడు. రోడ్డు ప్రమాదంలో కాళ్లకు దెబ్బలు తగలడంతో ప్రస్తుతం ఇంటి వద్దనే ఖాళీగానే ఉంటున్నాడని మృతుని తరుపు బంధువులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు బ్రిడ్జి క్రింద ఉన్న తాడును తొలగించి మఅతదేహాన్ని బయటకు తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మఅతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు పోలీసులు తరలించారు. మఅతుడు వివరాలు సేకరించిన అనంతరం బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️