అరకులోయ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్‌

అరుదైన ఆపరేషన్‌

మహిళ కడుపులోంచి ఎనిమిది కిలోల కణితి తొలగింపు

ప్రజాశక్తి- అరకులోయ : అరకులో ఏరియా ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అరకులోయ మండలం సిరగం పంచాయతీ దిబ్బ వలస గ్రామానికి చెందిన సోడేపల్లి థీమో అనే గిరిజన మహిళ ఆరు సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుంది. దీంతో అరకులోయ ఏరియా ఆసుపత్రికి సందర్శించగా , ఇక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించారు. బుధవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎల్‌.రాము, డాక్టర్‌ అప్పారావు, డాక్టర్‌ కృష్ణ, డాక్టర్‌ పవన్‌ ఆపరేషన్‌ చేసి ఆమె కడుపులో నుంచి 8 కిలోల కణితిని తొలగించారు. విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించి ఇంత పెద్ద కణితిని తొలగించిన వైద్యులను అరకులోయ ప్రాంతవాసులు అభినందించారు. అరకులోయ ఆసుపత్రిలో ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే మొదటిసారి అని స్థానికులు అంటున్నారు.

ఆపరేషన్‌ చేసి రోగి పొట్టలోని కణితి తొలగిస్తున్న వైద్యులు

➡️