భూ హక్కు చట్టం రద్దు చేయండి

Dec 19,2023 16:33 #Kakinada
  • పెద్దాపురంలో న్యాయవాదుల ప్రదర్శన,రాస్తారోకో

ప్రజాశక్తి – పెద్దాపురం(కాకినాడ) : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ హక్కు చట్టం – 27/2023 వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దాపురం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయవాదులు ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు.న్యాయవాదులు బార్‌ అసోసియేషన్‌ కార్యాలయం నుండి మున్సిపల్‌ సెంటర్‌ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం మున్సిపల్‌ సెంటర్‌లో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వేదుల సుబ్రహ్మణ్యం(మణి) మాట్లాడుతూ.. ఈ చట్టం వల్ల పేద, అట్టడుగు, దళిత గిరిజన వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కందుల నరేష్‌ కుమార్‌,సంయుక్త కార్యదర్శి మడికి రాంబాబు, న్యాయవాదులు ఎస్‌.నరసింహారావు, డివిఎస్‌ఎస్‌ రామచంద్రరావు, కొత్తిం చంటిబాబు, బొర్రా పద్మాసిని, విశాలాక్షి, విజయలక్ష్మి, సరస్వతి, వల్లీ బాబు,వందే విజరు కుమార్‌, జొన్నకూటి సుధాకర్‌, సకురు దుర్గారావు, మోగంది భాను ప్రకాష్‌, పి దొరబ్బాయి, మానవ హక్కుల సంఘం అధ్యక్షులు నూతలపాటి అప్పలకొండ, పారా లీగల్‌ వాలంటీర్లు కొమ్మోజు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వీరి ఆందోళనకు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు మద్దతు తెలిపారు.

➡️