శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు

May 16,2024 20:29

ప్రజాశక్తి – సీతానగరం : శాంతి భద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని సిఐ కె.రవికుమార్‌ హెచ్చరించారు. మండలంలోని పెదబోగిలి, చినబోగిలి, బూర్జ, నిడగల్లులో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎటువంటి గొడవలు జరగకుండా 144 సెక్షన్‌ అమల్లో ఉందని తెలిపారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ పార్టీకి చెందిన నాయకులు గానీ, ప్రజలు గానీ తగాదాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలను కాపాడాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్సై ఎం.రాజేష్‌, పోలీస్‌ సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

➡️