పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అంతా సిద్ధం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : చాగల్లు మండలంలో ఏడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈనెల 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరుగు పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు అంతా సన్నద్ధంగా ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారులు వి.ఖాదర్‌ బాబు (1) సిహెచ్‌ సుధాకర్‌ (2) తెలిపారు. మండలంలో చాగల్లు ఏడు జిల్లా పరిషత్‌ ఉన్నతపాఠశాలలో మొత్తం విద్యార్థులు 506 మంది పరీక్షలు హాజరవుతున్నట్లు మంగళవారం తెలిపారు. విద్యార్థులో 246 మంది బాలురు 260 మంది బాలికలు పరీక్షలకు హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారులు చెప్పారు. ప్రైవేటు ఏడు స్కూల్స్‌ నుండి 107 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ప్రభుత్వ, ప్రైవేటు పదో తరగతి విద్యార్థులు మొత్తం 613 విద్యార్థులు పద తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరవుతున్నట్లు వివరించారు. చాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సెంటర్లో చాగల్లు జడ్పీ హైస్కూల్‌ విద్యార్థులు, ఉన్నగట్ల జడ్పీ హైస్కూల్‌. శ్రీ రాజరాజేశ్వరి విద్యాలయ( చాగల్లు ). ఎస్‌ వి ఆర్‌ కె హై స్కూల్‌ ( చాగల్లు ) విద్యార్థులు.ఉన్న గట్ట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోహొ సెంటర్లో జడ్పీ హైస్కూల్‌ చాగల్లు. సూర్య (నందిగంపాడు ) మార్కొండపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సెంటర్లో జడ్పీ హైస్కూల్‌ మార్కొండపాడు. జడ్పీ హైస్కూల్‌ మల్లవరం. మరియు జయంతి హై స్కూల్‌ (మార్కొండపాడు) విద్యార్థులు ఆయా సెంటర్లో పరీక్షలు హాజరవుతున్నట్లు తెలిపారు బ్రాహ్మణగూడెం జిల్లా పరిషత్‌ ఉన్న పాఠశాల. చీక్కల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల. కలవలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కలవలపల్లి జిల్లా పరిషత్‌ విద్యార్థులతో పాటు లిటిల్‌ బిట్స్‌ చిక్కాల. శ్రీ భారతి బ్రాహ్మణగూడెం. చిల్డ్రన్‌ గార్డెన్‌ బ్రాహ్మణగూడెం స్కూల్‌ విద్యార్థులు నిడదవోలు మండలంలో వివిధ పరీక్షా కేంద్రంలో హాజరవుతున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు.

➡️