ఎన్నికల విధులకు హాజరయ్యే ఆశాలకూ అలవెన్సు ఇవ్వాలి

May 10,2024 00:38

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల విధులకు హాజరయ్యే ఆశా వర్కర్లకు అలవెన్స్‌ ఇవ్వాలని ఏపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల వద్ద పోలింగ్‌ మొదలు, పూర్తయ్యే వరకూ ఆశా వర్కర్లు మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చిందని చెప్పారు. అయితే రూ.లక్షల జీతాలు తీసుకునే ప్రభుత్వ అధికారులకు ఎన్నికల విధులు నిర్వహణకు ప్రత్యేక అలవెన్సులు, ఇతర సౌకర్యాలు ఇస్తున్నా అత్తెసరు గౌరవ వేతనంతో పని చేస్తున్న ఆశాలకు మొండి చేయి చూపడం సరికాదన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన పేరుతో నాదెండ్ల, వినుకొండ, రొంపిచర్ల మండలాల పరిధిలో ఇటీవల తొలగించిన అంగన్వాడీ కార్యకర్తలను కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మొదటి తప్పిదంగా భావించి విధుల్లోకి తీసుకోవాలని శివకుమారి కోరారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం దీనిపై జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవిస్తామన్నారు.

➡️