అంగన్వాడీలపై జగన్‌ సర్కార్‌ ఉక్కు పాదం

అంగన్వాడీలపై జగన్‌ సర్కార్‌ ఉక్కు పాదం

పాడేరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలు

అంగన్‌వాడీలపై ఉక్కుపాదంప్రజాశక్తి-పాడేరుటౌన్‌: సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్‌ సర్కార్‌ ఉక్కు పాదం మోపింది. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీల సేవలు అత్యవసర సర్వీసులు కిందకు రానప్పటికీ.. వారిని అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెబుతున్నారు. డిమాండ్ల పరిష్కారానికి 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎపి ప్రభుత్వం శనివారం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. వీరిని అత్యవసర సర్వీసుల కిందకి తీసుకొస్తూ జిఒ నెం-2ను జారీ చేసింది. ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడి వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత విధించింది. సుమారు రూ.3,450 తగ్గించి..రూ.8,050 వేతనాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. అంగన్వాడీలు 26 రోజులుగా సమ్మె చేస్తుంటే చర్చలతో కాలయాపన చేస్తూ డిమాండ్లు నెరవేర్చకపోగా వారిపై ఎస్మా ప్రయోగించడం దారుణం. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన సిఎం జగన్‌ ఇప్పుడు అణిచివేతకు పాల్పడడం అన్యాయం. ఇలాంటి చర్యలకు బెదిరేది లేదని జగన్‌ ను ఇంటికి పంపే దాకా పోరాటం సాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యేదాకా పోరాటం ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు. 26 రోజులుగా ఆందోళన చేస్తుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం బెదిరింపులకు దిగడంపై అంగన్వాడీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు.ఎస్మా చట్టాన్ని అతిక్రమిస్తే..ఎస్మా నిబంధనలను అతిక్రమించినట్లు బలమైన అనుమానం ఉంటే.. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విగాథం కలిగేలా సమ్మెలోకి దిగితే నేరశిక్షాస్మతితో సంబంధం లేకుండా.. పోలీసు అధికారులు వారెంట్‌ లేకుండానే అరెస్టు చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఉద్యోగులను డిస్మిస్‌ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు. సమ్మె చేస్తున్న వారితో పాటు వారిని ప్రోత్సహిస్తున్న, ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించే వారికి కూడా శిక్ష విధించవచ్చు.

➡️