అంగన్‌వాడీల నిరసన జ్వాలలు

షోకాజ్‌ నోటీసులు దగ్ధం చేస్తున్న అప్పలనర్స

ప్రజాశక్తి-పాడేరు:భోగి మంటల్లో అంగన్వాడీల నిరసన జ్వాలలు ఎగిసి పడ్డాయి. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆదివారం 34వ రోజు సమ్మెలో భాగంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో నిరసన శిబిరం వద్ద భోగి మంటలు వేసి ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులు, ఎస్మా ప్రతులను దగ్ధం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెల సరి వేతనం 26 వేలు పెంచాలని గత కొన్ని రోజులుగా సిఐటియు ఆధ్వర్యంలో అంగన్‌వాడి హెల్పర్స్‌ అండ్‌ వర్కర్స్‌ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం అల్లూరి జిల్లా కార్యదర్శి అప్పలనర్స మాట్లాడుతూ, అంగన్వాడి సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ తమ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం సుమారు 34 రోజులు పాటు సమ్మె జరుగుతుంటే సమస్యలు పరిష్కారం చేయకపోగా రాజకీయలు అంటగట్టడం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, కార్మికులు చిన్నారి, అంబిక, దేవి, జానకి, భవాని, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. అనంతగిరి: అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి, గంగరాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పలు చర్చల పేరుతో కాలయాపనం చేస్తుందని విమర్శించారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వాలు తుంగలోతుకి కార్మికులకు కనీస వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తుందని విమర్శించారు.ఈ కార్యక్రమంలో టోకురు సిపిఎం సర్పంచ్‌ కిలో ,మొస్య , సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌.నాగులు, అంగన్వాడి యూనియన్‌ నాయకురాలు సిహెచ్‌ కళావతి, కార్యకర్తలు చిలకమ్మా, సరస్వతి, కన్నయ్య కుమారి, రాజేశ్వరి పాల్గొన్నారు.చింతూరు: అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా సమ్మె శిబిరం వద్ద భోగీమంటల్లో ఎస్మా చట్టం, జిఒ 2 ప్రతులను దగ్ధం చేశారు. అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్షులు సవలం వెంకటరమణ యూనియన్‌ కోశాధికారి కామేశ్వరి. సభ్యులు జయ. కనకదుర్గ. స్వరూప. భద్రమ్మ. చిట్టమ్మ. చుక్కమ్మ. సత్యవతి. విజయకుమారి. పాల్గొన్నారు.కూనవరం : అంగన్వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా సమ్మె శిబిరం వద్ద భోగి పండుగ నిర్వహించి భోగి మంటలలో ఎస్మా ప్రయోగం, జిఒ2 ప్రతులను స్థానిక ప్రజల సమక్షంలో దగ్ధం చేసారు. సిఐటియు నాయకులు అన్నపూర్ణ, మండల కార్యదర్శి కొమరం పెంటయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు పాయం సీతారామయ్య పాల్గొన్నారువిఆర్‌ పురం: అంగన్‌వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా రేఖపల్లిలోని సమ్మె శిబిర వద్ద రంగురంగుల రంగవల్లికలు వేసి, భోగీపండుగను జరుపుకుని నిరసన చేపట్టారు నిరహారదీక్ష చేస్తున్న అంగన్‌వాడీలకు మిడ్డే మీల్స్‌, సిఐటియు కార్మికులు సంఘీభావం ప్రకటిచారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూణెం. సత్యనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు సున్నం రంగమ్మ, మండల అధ్యక్షులు నాగమణి మాట్లాడుతూ, అంగన్‌వాడీలకు ఇస్తున్న వేతనాలపై మంత్రి బొత్స సత్యనారాయణ అసత్యాలను చెబుతున్నారని మండిపడ్డారు. అంగన్వాడీల యూనియన్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు. మాట్లాడుతూ, ఇప్పటివరకు శాంతియుతంగా సాగిన అంగన్వాడీల సమ్మె ఉద్యమరూపం దాలుస్తుందని, జరిగే పరిణామాలకు జగన్‌రెడ్డి ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు.

➡️