అంగన్‌వాడీల వినూత్న నిరసనలు

చింతూరులో... అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-అనంతగిరి:ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగించాలని సిఐటియు ఉమ్మడి జిల్లా పూర్వ అధ్యక్షులు అజశర్మ పిలుపునిచ్చారు. మండలంలో గురువారం పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక తహసిల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడిల సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్‌ చెప్పిందని అన్నారు. గ్రాడ్యుటీ ఇవ్వాలని దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీలకు నోటీసులు జారీ చేసి విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాలు తీసి వేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు.రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు తలుచకుంటే ప్రభుత్వాన్ని పడగొడతాయని గుర్తు చేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించకపోతే మరింత పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జెడ్పీటీసీ సభ్యులు దీసరి గంగరాజు, సిఐటియు మండల కార్యదర్శి కిల్లో మోస్య, సీపీఎం మండల కార్యదర్శి సోమెల నాగులు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పి మంజుల కమిడి, లక్ష్మీ, కొర్రా లక్ష్మి, సాగర, సుమిత్ర తదితరులు పాల్గొన్నారుకబడ్డి ఆడుతూ ఆందోళనడుంబ్రిగుడ:అంగన్వాడి కార్మికులు చేపడుతున్న సమ్మె మండలంలో కొనసాగింది. గురువారం మండల కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ వద్ద అంగన్వాడి కార్మికులు వినూత్న రీతిలో కబడ్డీ ఆడుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు కే.కొండమ్మ, జి.పవిత్ర, కే.సత్యవతి, నిర్మల, అంగన్వాడీ కార్మికులు, హెల్పర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పెదబయలు:అంబేద్కర్‌ కూడలి జంక్షన్‌ వద్ద అంగన్వాడీల సమ్మె 22వ రోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొండమ్మ, దేవి, సుశీల, పద్మ, వరాలమ్మా తదితరులు పాల్గొన్నారు.రంపచోడవరం:అంగన్వాడీ వర్కర్స్‌ తమ సమస్యలను పరిష్కరించాలని చేపట్టిన సమ్మె గురువారానికి 24 రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో గురువారం అంగన్వాడీలు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్‌ జిల్లా కోశాధికారి కే రామలక్ష్మి మాట్లాడుతూ 24 రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ నాయకులు సింగారమ్మ, వెంకటలక్ష్మి, సత్యవేణి అంగన్వాడీలు పాల్గొన్నారు.చింతూరు :అంగన్వాడీ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని చేపట్టిన 24వ రోజు సమ్మె శిబిరాన్ని సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, మండల కార్యదర్శి సీసం సురేష్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తు శుద్ధి లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కార్మికులందరూ రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌, అంగన్వాడీ కార్మికులు నూక రత్నం, వెంకటరమణ, జయ, కామేశ్వరి, కన్నకదుర్గ, ముత్తమ్మ, తదితరులు పాల్గొన్నారు.కొయ్యూరు : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్ష గురువారం కూడా కొనసాగింది. తమ డిమాండ్స్‌ పరిష్కరించాక పోతే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకురాలు అచ్చిమ్మ, ముత్యాలమ్మ అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️