అనారోగ్యంతో ఆవు మృతి

ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: మండలంలోని పోతంగి పంచాయతీ బల్లుగూడలోని ఎస్‌.అప్పారావుకు చెందిన ఆవు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతి చెందినట్లు బాధిత రైతు స్థానిక విలేకరుల వద్ద వాపోయాడు. ఆవు అనారోగ్యంతో బాధ పడు తున్నట్లు సంబంధిత సచివాలయంలో ఏహెచ్‌ఏకు పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. సకాలంలో వైద్య సేవలు అందించక పోవడంతో పరిస్థితి విషమించి మృతి చెందిందని బాదిత గిరిజనుడు అప్పారావు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని తెలిపాడు. అధికారులు స్పందించి ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బాదిత గిరిజనుడు కోరుతున్నారు.

➡️