ఆదివాసీల రిలే దీక్షలు

ప్లకార్డులతో దీక్షలు చేపడుతున్న గిరిజనులు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజనేతరురాలు బుడ్డిగా కొండమ్మ 1/70 చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఇల్లు, షాపులను కూల్చాలని అదివాసులు సోమవారం దీక్షలు ప్రారంబించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు మాట్లాడుతూ, గిరిజనేతరాలు బుడ్డిగా కొండమ్మ వెలుగు కార్యాలయ స్థలాన్ని కబ్జా చేసి రెండంతస్థుల ఇల్లు, షాపులు నిర్మించు కోవడమే కాకుండా చుట్టూ ఉన్న గిరిజన ప్రజలపై దాడులు, చేస్తుందన్నారు. మూడు ఇల్లు, షాపులు, హౌటల్‌ నిర్మించి అద్దెలకు ఇస్తుందనారు. ఆమె చేపడుతున్న అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్న రెవెన్యూశాఖ సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని ఆదివాసులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కొర్ర ఆనంద్‌, కిల్లో రామారావు, రాజు, వరబోయిన మత్స్య రాజు, బీబీ ప్రసాద్‌, గెమ్మేలి చిట్టిబాబు, కోరాబు కోటిబాబు, జె.చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️