ఉపాధి హామీ కూలీలకు సదుపాయాలు కల్పించాలి

మాట్లాడుతున్న సిపిఎం నేత సన్నిబాబు

ప్రజాశక్తి- పెదబయలు :ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం అల్లూరి జిల్లా కమిటీ సభ్యులు బొండా సన్నిబాబు, సీతగుంట ఉపసర్పంచ్‌ బొండా గంగాధరం డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి కూలీల పని ప్రదేశాలలో సందర్శించారు. అనేక సమస్యలు వెలుగులో వచ్చాయి. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ, గతంలో పనిముట్లు, పారలు గుణపాలు సరఫరా చేసేవారని, నేడు కేంద్రం, రాష్ట్రంలో పరిపాలిస్తున్న పాలక పార్టీలు ఏమీ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఉపాధి కూలీలకు పనిముట్లు సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.పని ప్రదేశంలో కూలీలకు టెంట్లు, మంచినీరు, ప్రమాదవసత్తు దెబ్బ తగిలితే గాయాలు పాలైతే ప్రధమ చికిత్స మెడికల్‌ కిట్లు, కూర్చోడానికి తార్పాలిన్లు, పని ప్రదేశంలో చిన్న పిల్లలను చూసుకోవడానికి ఆలయాలు వంటి సౌకర్యాలు కానరాలేదన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయాలని చూస్తోందని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం వామపక్షాల పార్టీల పోరాట ఫలితంగా 2005లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చింన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సవరణ చేయాలని చూస్తుందని దుయ్యబట్డారు. ఈ చట్టంతో అనేకమంది పేదలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఉపాధిని కూడా రద్దు చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ర,్ట కేంద్ర ప్రభుత్వాలు స్పందించి వేసవికాలంలో ఉపాధి కూలీల పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

➡️