‘ఆధునిక’ సాగుతోనే వ్యవ’సాయం’

'ఆధునిక' సాగుతోనే వ్యవ'సాయం'

‘ఆధునిక’ సాగుతోనే వ్యవ’సాయం’ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌వ్యవసాయ అధికారులు సాగులో వస్తున్న ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని, రైతులకు అండగా నిలబడాలని తిరుపతి జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్‌ రావు అన్నారు. తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో జిల్లా విస్తరణ అధికారులకు సెంటర్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ బయో సైన్స్‌ ఇంటర్నేషనల్‌ (కాబి ) సంస్థ వారు సాగులో డిజిటల్‌ యాప్‌ ల గురించి, ఆన్లైన్‌ కోర్సుల గురించి ఇచ్చిన శిక్షణలో ఆయన మాట్లాడారు. కాబి యాప్‌లు , కోర్సులు విస్తరణ అధికారులకు చాలా ఉపయోగకరంగా ఉందన్నారు. అధికారులు వీటిని వినియోగించుకోవాలని కోరారు. కాబి దక్షిణ ఆసియా కోఆర్డినేటర్‌ మధు మంజరి యాప్‌ ల వినియోగం, ఆన్లైన్‌ కోర్సులు వినియోగం గురించి శిక్షణ ఇచ్చారు. అత్యంత విలువైన ఈ సేవలు భారతదేశంలో కాబి ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ భాస్కరయ్య, జిల్లా వ్యవసాయ కార్యాలయం నుండి ఏఓ లు శశికళ, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

➡️