గిరిజనులకు తప్పని డోలీ మోతలు

Jan 20,2024 00:07
డోలీలో తరలిస్తున్న బంధువులు

ప్రజాశక్తి -అనంతగిరి:మారుమూల గిరిజన గ్రామాలలో రోడ్డు సౌకర్యాలు లేక గిరిజన ప్రజలకు డోలీ మోతలు తప్పలేదు. మండలంలోని పిన్నకోట పంచాయతీ రాచకిలం గ్రామానికి చెందిన సూకురు. బాబురావు (18) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సరైన వైద్య సేవలు అందక తీవ్ర అస్వసతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు శనివారం దుప్పటి సహాయంతో డోలీ కట్టి సుమారు ఆరు కిలోమీటర్ల దూరం కొండ కోనల మధ్య దూరంలో ఉన్న పిన్నకోట ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మారుమూల గ్రామాలకు కనీస రోడ్డు సగరు లేకపోవడంతో రోగులకు సకాలంలో సరైన వైద్య సేవలు అందలేదు.

➡️