గిరిజనేతరురాలి ఆక్రమణలు తొలగింపు

ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులు

ప్రజాశక్తి హుకుంపేట:మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయం, గిరిజనుడైన విలేకరి స్థలాన్ని ఆక్రమించుకుని గిరిజనేతరాలైన బుడ్డిగా కొండమ్మ అక్రమ నిర్మాణాలకు పాల్పడింది. వెలుగు కార్యాలయం వద్ద ఇంటిని ఆమె నిర్మించుకుంది. వెలుగు కార్యాలయం మార్గంలో ఉన్న చెట్లను తొలగించి విలేకరికి చెందిన స్థలంలో అక్రమంగా పెన్సింగ్‌ చేసుకుంది. దీంతో ఆదివాసీ గిరిజన సంఘం నాయకుల సహకారంలో విలేకరి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణారావు, వీఆర్‌ఓ దనిసాని కొండబాబు, వెలుగు ఏపీఎం చిన్నారావు, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావులు ఆక్రమించిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలాన్ని వెలుగు డిపార్ట్‌ మెంట్‌కు అప్పజెప్పారు. అలాగే విలేకరికి చెందిన స్థలాన్ని కూడా అప్పగించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తాపులా కృష్ణారావు మాట్లాడుతూ, బుడ్డిగా కొండమ్మ ఆక్రమణలను స్వాధీనం చేసుకుని వెలుగు డిపార్ట్‌ మెంట్‌, విలేకరిప అప్పగించడంపై అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మెరకచింత మాజీ సర్పంచ్‌ లక్ష్మణ్‌ రావు మాట్లాడుతూ, 1/70 , పీసా చట్టాలకు వ్యతిరేకంగా బుడ్డిగా కొండమ్మ అక్రమంగా 20 సెంట్లలో ఇల్లు, షాపులు కట్టుకుందని తెలిపారు.ప్రభుత్వం ఆ ఇల్లు కూల్చాలని డిమాండ్‌ చేశారు. లేంటే త్వరలో అక్రమ కట్టడం ఉన్న చోట దీక్షలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు, తడిగిరి వైస్‌ సర్పంచ్‌ కిల్లో రామారావు, ఆదివాసీ సేన నాయకులు చుంచు రాజు, కొండబాబు, విజరు, కోటిబాబు, అరుణ, నాగ లక్ష్మీ, కళావతి పాల్గొన్నారు.

➡️