గిరిజన సమస్యలపై ధర్నా

Jan 26,2024 00:06
ధర్నా చేపడుతున్న నేతలుధర్నా చేపడుతున్న నేతలు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం కలెక్టరేట్‌ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు: ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సత్యనారాయణ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న హౌసింగ్‌ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర, పోడు పట్టాలు మంజూరు చేయాలన్నారు. కాఫీ రైతులకు బకాయి బిల్లును తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రోడ్లు మరమ్మతు చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో తాగు, సాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌కు గిరిజన సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్‌ నాయకులు. విష్ణుమూర్తి, ఈ పోతురాజు, డి.కృష్ణ, కూడా రాధాకృష్ణ, సెగ్గే సత్తిబాబు పాల్గొన్నారు.

➡️