ఘనంగా ఎలక్ట్రీషియన్స్‌ దినోత్సవం

Jan 27,2024 23:47
ర్యాలీ చేపడుతున్న ఎలక్ట్రీషియన్లు

-పాడేరులో ర్యాలీ.. జెండా ఆవిష్కరణ ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో శనివారం ఎలక్ట్రిషన్‌ డే ఘనంగా నిర్వహించారు. ఉమా నీలకంఠేశ్వర ఎలక్ట్రీషియన్‌ అండ్‌ ప్లంబర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని మోదకొండమ్మ ఆలయ ప్రాంగణంలో జండా ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో ఎలక్ట్రీషియన్లు ర్యాలీ నిర్వహించారు. శాస్త్రవేత్త థామస్‌ అల్వా ఎడిషన్‌ చీకట్లను పారదోలి వెలుగును ప్రసాదిస్తూ జనవరి 27, 1880 సంవత్సరమున విద్యుత్‌ బల్బు రూపొందించారని కొనియాడారు. దీంతో, ఎలక్ట్రీషియన్స్‌ డేను చేయడం జరుగుతుందని అల్లూరి జిల్లా ప్రైవేట్‌ ఎలక్ట్రిషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కొట్టగుల్లి రామారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన జిల్లా అధ్యక్షులు మహమ్మద్‌ అనీఫ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సందడి దామోదరం, పాడేరు శ్రీ మోద ఉమా నీలకంఠేశ్వర అధ్యక్షులు పొట్నురీ బబ్లు, అల్లూరి జిల్లా కోశాధికారి మట్టం స్వామి నాయుడు, అయ్యల నరేంద్ర, సరమండ వరప్రసాద్‌, కిల్లు హరిబాబు, గోకాడ కృష్ణారావు పాల్గొన్నారు.

➡️