జాతీయ స్థాయి హాకీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ఎంపికైన క్రీడాకారులతో పీడీలు, కోచ్‌లు

ప్రజాశక్తి-నక్కపల్లి:జాతీయ స్థాయి హాకీ పోటీలకు 18 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు ఎస్‌జిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, బిఎస్‌ హాకీ క్లబ్‌ ఫౌండర్‌ బలిరెడ్డి సూరిబాబు తెలిపారు. నక్కపల్లి హాకీ క్రీడా మైదానంలో నవంబర్‌ 3 నుండి 5వ తేదీ వరకు జరిగిన ఎస్‌జిఎఫ్‌ అండర్‌ -17 రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్‌ లో బాలికల విభాగం నుండి ఏపీలో వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న వారిలో 18 మంది హాకీ క్రీడాకారులు ప్రతిభ కనబరచడంతో జాతి స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. నక్కపల్లి నుండి క్రీడాకారులు ఎం.పూర్ణిమ, పి.విష్ణు వర్దిని, మిగిలిన ప్రాంతాల్లో 16 మంది క్రీడాకారులు ఎంపికయ్యారని, ఏపీ జట్టు తరపున ఈనెల 1 నుండి నుండి కర్ణాటక కొడగు జిల్లా మెడికర్‌ లో 67వ ఎస్‌జిఎఫ్‌ జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులుకు ట్రాగ్‌ షూట్‌లు, షూస్‌ పంపిణి చేశారు. అధ్యక్షులు చిన్న అప్పారావు, కార్యదర్శి తాతాజీ, బాపట్ల పిజికల్‌ డైరెక్టర్‌ వీర భద్రం, టీమ్‌ మేనేజర్‌ వాసంతి, పరవాడ పీడీ తులసి సత్యవతి, నక్కపల్లి హైస్కూల్‌ పిడి లక్ష్మి, ప్రధానోపాధ్యాయులు రామచంద్రరావు, కోచ్‌ రాంబాబు, కే.నానాజీ, రమణ, ప్రసాద్‌, రమేష్‌లు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.

➡️