తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

Jan 29,2024 23:24
మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:మండలంలోని కాశీపట్నం పంచాయతీ సారవానివాని పాలెం గ్రామంలో నెల కొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జడ్పీటీసీ నిధులతో బోరు ఏర్పాటుకు నిధులు కేటాయిస్తానని జడ్పీటీసీ దీసరి గంగరాజు అన్నారు. సోమవారం గ్రామంలో జెఈ తోపాటు సందర్శించారు. తాగునీటి సమస్యపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరు, ట్యాంక్‌, సోలార్‌ పధకం పని చేయకపోవడంతో మంచి నీటి సరఫరా నిలిచి పోయిందన్నారు. గ్రామంలో ప్రజల ఇబ్బందుల రీత్యా జడ్పీటీటి నిధులతో బోరు నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌.డబ్ల్యూ.ఎస్‌ జెఈ గౌతం, స్ధానిక ఎంపిటిసి మూతి బోయిన సన్యాసిరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు కాకర సింగులు, మామిడి కృష్ణ, గిరిజన సంఘం నాయకుడు నరాజీ సురేష్‌ బాబు , గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️