తీర ప్రాంతాల్లో అధికారుల పర్యటన

పర్యటిస్తున్న అధికారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:తుఫాన్‌ ప్రభావంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ అంబేద్కర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని తీర ప్రాంత గ్రామాలైన బంగారమ్మ పేట, డిఎల్‌ పురం, రాజయ్యపేట తదితర తీర ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో భారీ వర్షం, ఈదురు గాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని సూచించారు. తుఫాను కేంద్రాలను పరిశీలించారు. విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

➡️