నేరాలకు దూరంగా ఉండాలి

Jan 28,2024 23:59
మాట్లాడుతున్న పోలీసులు

ప్రజాశక్తి – పెదబయలు :పెదబయలు మండల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వనబంగి, కిముడుపల్లి, పెద్దకోడపల్లి గ్రామాలలో సీఐ ఎస్‌.రమేష్‌ కుమార్‌, ఎస్సై పి.మనోజ్‌ కుమార్‌ పర్యటించారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రజలకు అవగాహన కల్పించారు. నాటు సారా, గంజాయి సాగు వంటి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు

➡️