సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహన

సికిల్‌సెల్‌ ఎనీమియా

ప్రజాశక్తి – ఆనందపురం : సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహనతోనే సాధికారిత సాధించవచ్చని ఆనందపురం పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ ఎం.గంగునాయుడు అన్నారు. బుధవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సికిల్‌సెల్‌ ఎనీమియాపై అవగాహన సదస్సులో మాట్లాడుతూ, రక్తహీనత, కళ్ళు పసుపు రంగులో మారడం, తీవ్రమైన ఒళ్లునొప్పులు, కీళ్ళ నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తరుచుగా అంటువ్యాధులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే సికిల్‌సెల్‌ ఎనీమియా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి నిర్థారణ జరిగితే, చికిత్స ద్వారా జీవనాణ్యత పెంచుకోవచ్చన్నారు. పుట్టబోయే శిశువులకు సికిల్‌సెల్‌ ఎనీమియా సంక్రమించకుండా నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ షహనాజ్‌ సాధియా, సిహెచ్‌ఒ పి సాంబమూర్తి, ఆరోగ్య పర్యవేక్షకులు ఎన్‌ కృష్ణమోహన్‌, వెలుగు కోఆర్డినేటర్‌ కె సత్యంనాయుడు, వెలుగు మండల ఎపిఎం జి.నాగభూషణరావు మండల సమాఖ్య ప్రతినిధులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు

మాట్లాడుతున్న డాక్టర్‌ గంగునాయుడు

➡️