ప్రత్యేక డిఎస్‌సి నిర్వహించాలి : సిపిఎం

వినతిపత్రాన్ని చూపుతున్న పడాల్‌, నాయకులు

ప్రజాశక్తి.చింతపల్లి:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని సిపిఎం నేత చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 175 పోస్టులకు గాను ఎస్టీలకు 07 పోస్టులు, రంపచోడవరం, చింతూరు ఏజెన్సీలో 205 పోస్టుల గాను 10 పోస్టులు, సీతంపేట ఏజెన్సీ ప్రాంతంలో 35 పోస్టులకు 06, విఆర్‌ పురం ఐటిడిఎ పరిధిలోని 70 పోస్టులకు గాను 08 పోస్టులు మాత్రమే గిరిజనులకు కేటాయించారన్నారు. ఏజెన్సీకి 500 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి కేవలం 38 పోస్టులతో సరిపెట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజరు, మండల నాయకులు సాగిన చిరంజీవి, మజ్జి రాంబాబు, కిల్లో సింహాచలం పాల్గొన్నారు.

➡️