ఫ్యామిలీ ఫిజీషియన్‌తో మెరుగైన వైద్యం

హాజరైన వైద్యులు, సిబ్బంది

ప్రజాశక్తి -డుంబ్రిగుడ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజీషియన్‌తో ప్రతి ఒక్కరికి మెరువైన వైద్య సేవలు అందుతున్నాయని మండల వైస్‌ ఎంపీపీ ఎస్‌.ఆనంద్‌ చెప్పారు. మండలంలోని కండ్రుమ్‌ పంచాయతీ కేంద్రంలో బుధవారం డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదని, వైసిపి ప్రభుత్వం మాత్రం సామాన్య వ్యక్తికి కూడా మెరువైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఫ్యామిలీ ఫిజీషియన్‌ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిణి అంబికా రమణి పాల్గొన్నారు.

➡️