భారీ వృక్షాల తొలగింపుపై పట్టింపేదీ: సిపిఎం

పరిశీలిస్తున్న చిన్నయ్య పడాల్‌

ప్రజాశక్తి-చింతపల్లి:గ్రామాలకు రోడ్లు వేయడానికి ఫారెస్ట్‌ చట్టం అడ్డు వస్తుందని చెపుతున్న ఫారెస్ట్‌ అధికారులు ఎన్‌హెచ్‌ ఫైవ్‌ పేరుతో రోడ్డు పక్కన ఉన్న అనేక వృక్షాలు తొలగిస్తుంటే ఎందుకు ఆటంకం పరచలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోనంగి చిన్నయ్య పడాల్‌ ప్రశ్నించారు. ఎన్‌హెచ్‌5 రోడ్డు విస్తరణలో భాగంగా పెద్ద గడ్డలు వద్ద భారీ వృక్షాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ,రోడ్డు పక్కన ఉన్న పెద్ద వృక్షాలు కొట్టేస్తుంటే ఫారెస్ట్‌ అధికారులు ఏమి సమాధానం చెపుతారన్నారు.ఫారెస్ట్‌ చట్టాలు ఉన్నా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఇంత వృక్ష్షం పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో పర్యావరణ అధికారులు చెప్పాలని కోరారు.

➡️