భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు

అరకులో భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు వేస్తున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి-అరకు లోయ :మండల కేంద్రంలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట శనివారం భోగి మంట వేసి ఎస్మా చట్టం కాపీలను మంటలో వేసి దగ్ధం చేశారు. అంగన్వాడీల సమస్యలు సమగ్రంగా చర్చించి పరిష్కరించ వలసిన మంత్రి బొత్స సత్యనారాయణ ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పడం సమంజసం కాదని అంగన్‌వాడీలు తెలిపారు. అధికారం కోసం హామీలు ఇవ్వడం కాదని, ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలన్నారు. ప్రభుత్వాలు పని చేయకపోతే నిలదీసి అడగాలని అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆవేదనతో గతంలో మాట్లాడారని, ఆ మాటలు ప్రస్తుతం ఏమి అయ్యాయని తెలిపారు. సంక్రాంతి తర్వాత ఉదృతంగా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. తదుపరి జరిగే పరిణామాలకు చర్చల పేరుతో మోసం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి బాధ్యత వహించవలసి ఉంటుందని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించకపోతే గతంలో చంద్రబాబు నాయుడు కు పట్టిన గతే పడుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు దురియ నాగమ్మ, మండల కార్యదర్శి కొర్రా లక్ష్మి, మండల అధ్యక్షులు పాంగి. వెంకటలక్ష్మి, శారదా, సునీత, అరుణ, శాంతి, నిర్మల ,నాగమ్మ, తదితరులు పాల్గొన్నారు.అనంతగిరి:తమకు కనీస వేతనం 26 వేల వేతనం పెంచాలని కోరుతూ సమ్మె చేపట్టి శనివారంతో 33 రోజులకు చేరుకుంది. అంగన్వాడిల సమ్మెకు మద్దతుగా యుటిఎఫ్‌ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా యుటిఎఫ్‌ కార్యదర్శి పుడిగి దేముడు, జిల్లా కౌన్సిలర్‌ జమితి సత్యనారాయణ మాట్లాడుతూ, న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ మండల నాయకులు సోమేలి గంగరాజు, అంగన్వాడీ మండల యూనియన్‌ నాయకురాలు పి.మంజుల, సిఎస్‌ కళావతి, కె.లక్ష్మి, చిలకమ్మ తదితరులు పాల్గొన్నారుముంచింగిపుట్టు:సమస్యలను పరిష్కారం చేయాలని శనివారం మండల కేంద్రంలో ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా మండల నాయకులు మౌలమ్మ మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనంగా నెలకు రూ.26000 ఇవ్వాలని, గ్రాట్యుటీతో వివిధ రకాల డిమాండ్స్‌ ను పరిష్కారం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి భీమరాజు, జర్ల వైస్‌ సర్పంచ్‌ గణపతి, అంగన్వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అంగన్వాడీల సంతకాల సేకరణప్రజాశక్తి-చింతూరుఅంగన్వాడీల ఆందోళనల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్త పిలుపు శనివారం చింతూరులో సంతకాల సేకరణ చేపట్టారు. దీనికి ముందు 33వ రోజు నిరాహార దీక్షలనున్యాయవాది మడివి రవితేజ ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి పోడియం లక్ష్మణ్‌, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నూకరత్నం, వెంకటరమణ, కామేశ్వరి, కనకదుర్గ, భద్రమ్మ, ముత్తమ్మ, సత్యవతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. రంపచోడవరం : స్థానిక తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణంలో అంగన్వాడీ వర్కర్స్‌ చేపట్టిన దీక్ష 33వ రోజున యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం అంగన్వాడీల దీక్షకు మద్దతుగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ప్రజలు, లబ్ధిదారుల నుండి సంతకాలను సేకరించారు. అనంతరం గ్రామంలో భిక్షాటన చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ నాయకులు వెంగళరావు, కారం సూరిబాబు, సనాతన బాబు, అంగన్వాడి లీడర్స్‌ కెవి రామలక్ష్మి, ఎం మంగయమ్మ, దేవీపట్నం, రంప చోడవరం మండలాల అంగన్వాడీలు పాల్గొన్నారు.విఆర్‌.పురం : మండలంలో రేఖపల్లి జంక్షన్‌ వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 33 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం వద్ద సంతకాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పూనెం సత్యనారాయణ, యూనియన్‌ నాయకులు సున్నం రంగమ్మ, ముసురు రాజేశ్వరి, సిహెచ్‌ సుబ్బారావు, సిపిఎం మండల కార్యదర్శి సోయం చినబాబు, కమ్మచిచ్చూ సత్యనారాయణ, నాల్లారపు ప్రకాష్‌రావు పాల్గొన్నారు. రాజవొమ్మంగి : స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా అంగన్‌వాడీలు చేస్తున్న సమ్మెలో భాగంగా శనివారం సర్కిల్‌గా ఏర్పడి నిరసన తెలిపారు. రహదారిపై లయబద్ధంగా నృత్యాలు చేశారు. భిక్షాటన, కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించకుండా ఎన్ని బెదిరింపు చర్యలకు పూనుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు టి శ్రీను, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు సిహెచ్‌ కుమారి, కె.వెంకటలక్ష్మి, ఎల్‌.సత్యవతి, నూకరత్నం, రమణ, రమణి, మంగ, సుందరమ్మ, రత్నం, మేరీ, రాధ, భవాని, రాజేశ్వరి, లక్ష్మీ, వీరయ్యమ్మ, వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.సజ్జల చిత్రపటం దగ్ధంసీలేరు : అంగన్వాడీల సమ్మెపై దుష్ప్రచారం చేస్తున్న రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాన్ని జికె.వీధి మండల కేంద్రంలో అంగన్వాడీలు శనివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి గడుతూరు సత్యనారాయణ మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మె రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని విమర్శించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు అప్పల నరసమ్మ, ఎల్‌.సత్యవతి, గాలకొండ ఎంపీటీసీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️