మత్స్యగుండం ముఖ ద్వారం ప్రారంభం

ప్రారంభిస్తున్న పిఒ

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని మఠం పంచాయతీ మత్స్యలింగేశ్వర సమగ్ర గ్రామాభివృద్ది సేవా సంఘం ఆధ్వర్యంలో మత్స్యగుండం మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం వద్ద రూ. 5.50 లక్షల వ్యయంతో నిర్మించిన ముఖద్వారాన్ని ఐటిడిఏ పిఓ వి. అభిషేక్‌ బుధవారం ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్టు అధికారి మత్స్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతరా లయంలో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మత్స్యాలను దర్శించుకున్నారు. దాతలు ఇచ్చిన నిధులతో ముఖద్వారాన్ని నిర్మించామని ఆలయ కమిటీ సభ్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శాంతకుమారి, ఆలయ కమిటీ సభ్యులు చంద్ర శేఖర నాయుడు, కేశవరావు నాయుడు, బీంబాబు, చిట్టినాయుడు పాల్గొన్నారు.

➡️