మధ్యాహ్న’ కార్మికులకు కనీస వేతనం చెల్లించాలి

ప్రజాశక్తి-హుకుంపేట:మిడ్‌ డే మీల్స్‌ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ నేత, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, కిల్లో రామారావు, మిడ్‌ డే మీల్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షరాలు వంతాల స్వప్నలు డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం భవన్‌లో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ,స్కూల్‌ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఖర్చు భరించి పెడుతున్నారన్నారు.ప్రతీ నెల 5వ తేదీ లోపు వేతనాలు, బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.పెరుగుతున్న ధరలకు అనుగూనంగా మెనూ చార్జీలు పెంచాలని, ప్రమాద భీమా, నష్ట పరిహారం చెల్లించాలన్నారు. సీఎం జగన్‌ పాద యాత్రలో ఇచ్చిన హామీ అమలు చేయాలనీ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎండీ ఎం, శానిటరీ వర్కర్స్‌ కొర్ర సోమరన్న, సీసా కోటేశ్వరరావు, కృష్ణవేణి, కాంతమ్మ, రత్నాలమ్మ, ముక్తమ్మ, చిలకమ్మ, వరలక్ష్మి, బంగారమ్మ పాల్గొన్నారు.

➡️