మన్యం బంద్‌ విజయవంతం

అరకులోయలో మూతపడ్డ ట్రైబల్‌ మ్కూజియం

ప్రజాశక్తి పాడేరు: గిరిజన స్పెషల్‌ డిఎస్సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, జీవో 3 చట్టబద్ధత కోసం ఆర్డినెన్స్‌ జారీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆదివారం చేపట్టిన మన్యం బంద్‌ విజయవంతమైంది. బంద్‌తో పాడేరులో షాపులు, హౌటళ్లు, దుకాణాలు, మూతపడ్డాయి. ప్రైవేట్‌ వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు లేక ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం వెలవెల పోయింది. ఆర్టీసీ బస్సులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి. పాడేరు మెయిన్‌ రోడ్‌ అంబేద్కర్‌ సెంటర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ రోడ్‌, పాత బస్టాండ్‌ సెంటర్‌లోని షాపులు మూతపడ్డాయి. వర్తక వాణిజ్య సంస్థలన్నీ మూతపడడంతో పాడేరు పట్టణంలోని కూడలి ప్రాంతాలన్నీ బోసిపోయాయి. ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన సమాఖ్య నాయకులు రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పంగి కార్తిక్‌, నాయకులు చిన్నారావు, సింహాద్రి, మత్యరాజు, రావణ, మహిళ సంఘం నాయకులు దసమ్మ, సిపిఎం మండల కార్యదర్శి ఎల్‌.సుందర రావు, నాయకులు బొజ్జన్న పాల్గొన్నారు.పలువురు నేతల అరెస్ట్‌ బంద్‌లో పాల్గొన్న ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ, జిల్లా అధ్యక్షుడు ఎస్‌ ధర్మన్న పడాల్‌, గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధాకృష్ణ, ఎస్‌.ఎఫ్‌ఐ జిల్లా నాయకులు చిన్నారావు, సింహాద్రి, మత్యరాజు, రావణ, మహిళ సంఘం నాయకులు దసమ్మ, సి.పి.ఎం మండల కార్యదర్శి ఎల్‌.సుందర రావు, నాయకులు బొజ్జన్న తదితరులను అరెస్ట్‌ చేసి విడుదల చేశారు.ఆదివాసీలకు జగన్‌ అన్యాయంపాడేరు: ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కు చట్టబద్దత కల్పించక పోతే వైసిపి ని వచ్చే ఎన్నికలలో ఓడించి జగన్‌కి తగ్గిన బుద్ది చెప్పాలని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్శ ప్రజలకు పిలపునిచ్చారు. బంద్‌ సందర్భంగా అప్పలనర్శ మాట్లాడుతూ, పాడేరు ఐటిడిఏ పరిధిలో ఉపాధ్యాయ పోస్టులు 1000 ఖాళీలు ఉంటే 135 పోస్టులు మాత్రమే ప్రకటించారన్నారు. 135 పోస్టులకు గాను కేవలం ఎస్టీలను 7 పోస్టులు కేటాయించడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతాల్లో పోస్టులు ఆదివాసీలకు మత్రమే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు జీవో 3 పునరుద్ధరణ కు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయాలన్నారు.-మూతపడిన పర్యాటక కేంద్రాలు.అరకులోయరూరల్‌: అరకులోయలో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. వాహనాల రాకపోకలు నిలిపోయాయి. ప్రముఖ పర్యాటక కేంద్రమైన పద్మావతి గార్డెన్‌, గిరిజన మ్యూజియం, వాటర్‌ ఫాల్స్‌ మూతబడ్డాయి. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్‌ మాట్లడుతూ, జిఓ 3 రద్దుతో గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగినా ఎంపి, ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారో సమా ధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.గతంలో జిఒ 3 అమలులో ఉన్నప్పుడు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు వచ్చాయని, ఇప్పుడు రద్దుతో ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పారు. తక్షణమే గిరిజన ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, లేకపోతే వైసీపీ పార్టీకి ఎన్నికల్లో నిరుద్యోగులు, గిరిజనులు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు జి.బుజ్జి బాబు, టీడిపి రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు సియ్యారి దొన్నుదొర, సీపిఎం మండల కార్యదర్శి కె.రామారావు, సీఐటియు మండల కార్యదర్శి జన్ని భగత్‌ రామ్‌, అధివాసి కాపి రైతు సంఘం ఆల్‌ ఇండియా ఉపాధ్యక్షులు జి.చిన్నబాబు, కాంగ్రెస్‌ నాయకులు, చిన్నస్వామి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు బుజ్జి బాబు, నాని బాబు, మగ్గన, జగన్నాధం, జోషీ, కోగేష్‌, గిరిజన ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటి జిల్లా కో కన్వీనర్‌ బురిడీ ఉపేంద్ర, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు చెట్టి గంగాధర్‌ స్వామి, మాజీ ఎంపీటీసీ సాయి బాబా యువకులు పాల్గొన్నారు.అనంతగిరి:ప్రముఖ ప్రర్యాటక కేంద్రమైన బొర్రా గుహలు మూతపడ్డాయి. వ్యాపార దుకాణాలు మూసి వేశారు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జెడ్పిటిసి గంగరాజు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని విమర్శించారు. గిరిజన యువతి, యువకులకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సర్పంచ్‌ కిల్లో మొస్య, మండల కార్యదర్శి ఎస్‌, నాగులు, గిరిజన సంఘం మండల అధ్యక్షులు ఎస్‌, కొండలరావు, సింగులు కృష్ణ, యుటిఎప్‌ జిల్లా అధ్యక్షులు పి.దేముడు, నాయకులు గంగరాజు, కాంగ్రెస్‌ మండల నాయకులు అప్పలరాజు, నిరుద్యోగుల సంఘం కన్వీనర్‌ చంటి బాబు పాల్గొన్నారుపెదబయలు: మండల కేంద్రంలో బంద్‌ విజయవంతమైంది. ఆదివాసీ గిరిజన సంఘం పూర్వ అధ్యక్షులు బోండా సన్నిబాబు ఆధ్వర్యంలో మెయిన్‌ రోడ్డుపై బైఠాయించారు. ప్రయివేట్‌ వాహనాలు, ఆర్టీసీ బస్సులు నిలిచి పోయాయి. షాపులు, హౌటల్లు మూతపడటంతో నిర్మాణస్యంగా మారింది. ఈ కార్యక్రమంలో సీతగుంట ఎంపీటీసీ కె.బొంజుబాబు, గిరిజన సంఘం మండల కమిటీ శరబన్న, టిఎస్‌ఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడు థాంగుల జగత్‌ రారు, సీతగుంట వైస్‌ సర్పంచ్‌ గంగాధరం, గిరిజన వర్తక సంఘం కార్యదర్శి గూబరి రాధాకృష్ణ, జనసేన నాయకుడు పి ప్రశాంత్‌ పాల్గొన్నారు.హుకుంపేట:మండల కేంద్రంలో పెట్రోల్‌ బంకులు, దుకాణాలు మూతపడ్డాయి. రోడ్డుపై బైఠాయించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి కృష్ణారావు, సిపిఎం మండల కార్యదర్శి వలసనైని లక్ష్మణరావు, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఎస్‌ హైమావతి, ఆదివాసి ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో కన్వీనర్‌ కూడేలి నూకరాజు పి నరసింహమూర్తి, కొండలరావు టిడిపి నాయకులు శంకర్రావు, మాజీ సర్పంచ్‌ కామేశ్వరం నాయకులు తదితరులు పాల్గొన్నారు.డుంబ్రిగుడ:మండల కేంద్రంలో కిరాణా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వాహనదారులు ఎక్కడకక్కడే తమ వాహనాలను నిలిపేశారు. మండల కేంద్రంలోని పెట్రోల్‌ బంక్‌, పర్యాటక కేంద్రం మూతపడ్డాయి. గిరిజన సంఘం, వివిధ పార్టీల నాయకులు, గిరిజనులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ,భాష వాలంటీర్లను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెన్యువల్‌ చేయాలనీ డిమాండ్‌ చేశారు. జి ఒ 3ను పునరుద్ధరించాలన్నారు. ఈ ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.సూర్యనారాయణ, పి.సత్యనారాయణ, సిపిఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు, టిడిపి మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, సిపిఐ మండల అధ్యక్షుడు కే.సింహాచలం, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకుడు రాజబాబు, బాషా వాలంటీర్ల సంఘం డివిజన్‌ నాయకురాలు పి కుమారి, గిరిజన సంఘం నాయకులు పి డుంబు, నిరుద్యోగ యువత, గిరిజనులు పాల్గొన్నారు.జి.మాడుగుల: మండల కేంద్రంలో బంద్‌ విజయవంతంగా ముగిసింది డీఎస్సీ సాధన కమిటీ జిల్లా కో- కన్వీనర్‌ మత్స్యరసా. నారాయణరాజు మాట్లాడుతూ, జీవో 3కు చట్టబద్ధత కల్పించి, ఆదివాసీ మాతృభాష వాలంటీర్లను రెన్యువల్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్‌ పార్టీలు గిరిజన సంఘాలు మద్దతు పలికాయి. ఈ బందులో డీఎస్సీ సాధన కమిటీ సభ్యులు వండ్లాబు గణేష్‌, చిన్న, రవి, సాగిన కోటి బాబు, కిడారి. బీమ్‌ బాబు పాల్గొన్నారు. చింతపల్లి:ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. హనుమాన్‌ జంక్షన్‌ నుండి పాత బస్టాండ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆదివాసి గిరిజన సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి ధనుంజరు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురుమూర్తి, కిలో చిరంజీవి, వంతల శ్రీను, ఆదివాసి మాతృభాషా విద్యా వాలంటీర్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పాంగి శ్రీను, మండల కార్యదర్శి సాగిన చిరంజీవి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్‌ కృష్ణ, స్పెషల్‌ డిఎస్సి సాధన సమితి నాయకులు సోడా సతీష్‌ పాల్గొన్నారుముంచింగి పుట్టు:మండల కేంద్రంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం బంద్‌ని చేపట్టారు. మండల అధ్యక్షుడు ఎం ఎం శ్రీను ఆధ్వర్యంలో నినాదాలు చేపట్టారు. గిరిజనులు పండిస్తున్న పంటలను గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు లక్ష్మీపురం, సర్పంచ్‌ కొర్రా త్రీనాథ్‌, సిపిఎం నేతలు , గిరిజన సంఘం నేతలు నారాయణ, జీనా బంధు పాల్గొన్నారు.రంపచోడవరం : జిఒ 3 పునరుద్ధరణ, గిరిజన మెగా డిఎస్‌సి ప్రకటన, గిరిజన హక్కుల పరిరక్షణ, చట్టాలు పటిష్ట అమలు చేయాలంటూ ఆదివాసీగిరిజన సంఘం, ఆదివాసీ జెఏసి ఆద్వర్యంలో ఏజెన్సీ బంద్‌ రంపచోడవరంలో విజయవంతమెంది. ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్‌, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు మట్ల వాణిశ్రీ పాల్గొన్నారు బంద్‌ నేపథ్యంలో వర్తక, వాణిజ్య,వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూత పడ్డాయి,వాహన రాకపోకలు గంటలు తరబడి నిలిచిపోయాయి.గిరిజనులు అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద జాతీయ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.రంపచోడవరం మండలం గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు సాధన విద్యాసాగర్‌ తీగల శ్రీనివాస్‌ కే శాంతి రాజు బి సింహాద్రి పాల్గొన్నారు.రాజవొమ్మంగి: ఆదివాసీ గిరిజన సంఘం, ఆదివాసీ జెఎసి ఆధ్వర్యంలో మన్యం బంద్‌ రాజబొమ్మంగిలో విజయవంతమైంది. రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్‌ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కుంజం జగన్నాథం, కొండ్ల సూరిబాబు, పాండవుల సత్యనారాయణ, ప్రవీణ్‌, వజ్రపు అప్పారావు, గంపా నాగరాజు, తాము సూరిబాబు, ఈకా అచ్చిరాజు, ఈకా పెంటన్నదొర, రామకృష్ణ, బి రామకృష్ణ, సిపిఎం నాయకులు పొత్తూరి సత్యనారాయణ, జర్తా రాజు, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, సిఐటియు, ప్రజా సంఘాల నేతలు జి నానాజి, జి రమేష్‌, ఎం రమేష్‌ పాల్గొన్నారు.విఅర్‌ పురం: విఅర్‌ పురంలోఉదయం 5 గంటలు నుండే ఆదివాసీ గిరిజన సంఘాల నాయకులు రోడుకడపై బైఠాయించి నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మన్యం బంద్‌కు టిడిపి సిపిఎం రైతు సంఘం, ఎఎస్‌పి సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి పూనం ప్రదీప్‌ కుమార్‌, ఆదివాసీ నాయకులు పాయం రామారావు, పాయం లక్ష్మణ్‌, సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు నాయకులు పంకు సత్తిబాబు కుంజ నాగిరెడ్డి తుర్రం బాబురావు సర్పంచ్‌ వెట్టి లక్ష్మి వడ్లది రమేష్‌, హాజరత్‌ లక్ష్మణ్‌ ప్రకాష్‌, విశ్వనాథ్‌, సూరిబాబు, సత్యనారాయణ, ప్రజానాట్యమండలి సిహెచ్‌ సుబ్బారావు పాల్గొన్నారు చింతూరు : మన్యం బంద్‌లో భాగంగా ఎర్రంపేట నుండి చింతూరు ఆదివాసి అమరవీరుల విగ్రహాల వరకు భారీ ర్యాలీ నిర్వహించినారు. చింతూరు సెంటర్‌ వద్ద ఉన్న వ్యాపార దుకాణాలు ప్రయాణ వాహనాలు, పెట్రోల్‌ బంకులు, హోటల్స్‌మూతబడ్డాయి. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్‌, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్‌, పులి సంతోష్‌ మాట్లాడుతూ ఆదివాసీలసమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బంద్‌కు జనసేన మండల అధ్యక్షులు మడివి రాజు, తెలుగుదేశం నాయకులు తమన్న దొర మద్దతు తెలిపారు. తుమ్మల ఎంపిటిసి రేఖ రాజ్‌కుమార్‌, గిరిజన సంఘం నాయకులు దిలీప్‌, ముట్టం రాజయ్య, లెనిన్‌, శీలం తమ్మయ్య, పాండు నాగార్జున, కారం సుబ్బారావు, సాయి, కూర భీమయ్య, తీగల రవి, సిపిఎం నాయకులు మొత్తం రాజయ్య, బీరబోయిన దిలీప్‌. పొడియం లక్ష్మణ్‌, భీమయ్య పాల్గొన్నారు. బంద్‌తో అన్ని వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు.. చింతూరు ఎస్‌ఐ డి. శ్రీనివాస్‌ సిబ్బంది బందోబస్తు కల్పించారు. సీలేరు: ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యంలో బంద్‌ సిపిఎం నాయకులు పాల్గొని గూడెం ప్రధాన రహదారిని దిగ్బంధం చేసి వాహనాలు రాకపోకలను నిలిపివేశారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో గాలికొండ ఎంపీటీసీ అంపరంగి బుజ్జిబాబు టిడిపి మండల యువజన సంఘం నాయకులు సిపిఐ మండల కార్యదర్శి కే సత్తిబాబు జేఏసీ నాయకులు రామచందర్రావు పరమేశుపాల్గొన్నారు.కూనవరం : మండలంలోని టేకులబోరు గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు, సిపిఎం నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేసారు. కూనవరం నుండి చింతూరు వెళ్లే రహదారిలో కూటూరు గ్రామం వద్ద రాస్తారోకో నిర్వహించి, ఆదివాసీ గిరిజన సంఘమండల కార్యదర్శి బాబు బొర్రయ్య, వైస్‌ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య, జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరావు, సర్పంచ్‌ నాగమణి, శంకర్‌, ఎంపీటీసీ జయసుధ తాళ్లూరి శ్రీనివాసరావు, మడెం బాబురావు,కొండా ఈశ్వర్లు పాల్గొన్నారు.కొయ్యూరు: కొయ్యూరులో బంద్‌ విజయవంతమైందని సిపిఎం జిల్లా నాయకులు సూరిబాబు తెలిపారు.. మండల కేంద్రంలో సంత జరగలేదు. బంద్‌కు సంఘీభావం తెలిపిన జిసిసి మాజీ రాష్ట్ర చైర్మన్‌, టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఎంవివి.ప్రసాద్‌ మాట్లాడుతూ, మెగా డిఎస్‌సి ప్రకటించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. డౌనూరు పంచాయతీ మర్రిపాలెం వద్ద ఉద్యోగ సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. మారేడుమిల్లి: ఆదివాసి గిరిజన సంఘం, ఆదివాసి స్పెషల్‌ డిఎస్‌సి సాధన కమిటీ ఆధ్వర్యంలో మారేడుమిల్లి మండలంలో ఉదయం ఐదున్నర గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల దాకా వ్యాపార సంస్థలు బంద్‌ స్వచ్ఛందంగా పాటించాయి. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్‌ రెడ్డి మాట్లాడుతూ, గిరిజనులను దగా చేసే చర్యలను ప్రభుత్వాలు ఇప్పటికైనా మానుకోవాలన్నారు. లేకుంటే మన్యవాసులు, ముఖ్యంగా యువత తిరబడి, ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం నాయకులు వేటుకూరు సర్పంచ్‌ ఈతపల్లి మల్లేశ్వరి, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, కత్తుల రమణారెడ్డి,కత్తుల నాగరాజ రెడ్డి, బాబురావు ,దూడ సువర్ణ కర్ణకుమార్‌, దూడ ప్రమోద్‌, చుంచు రాకేష్‌, దూడ సందీప్‌, సురబోయిన పవన్‌, కట్టుపల్లి నాని బాబు, లక్కొండ సతీష్‌, గరిడే చరణ్‌, బి.సూరి, బి సాయి, వీరవత్తుల పిన్‌ హార్స్‌ , వీకా రాజన్న దొర, ఈతపల్లి లింగారెడ్డి , కత్తుల గంగిరెడ్డి,బట్ట మల్లి రెడ్డి, పల్లాల నారాయణరెడ్డి, బచ్చెల ధర్మారెడ్డి, బచ్చెల చిన్నారెడ్డి బట్ట ముత్యాల రెడ్డి పాల్గొన్నారు.

➡️