మానసిక ఆరోగ్యం పై అవగాహన

అవగాహన కల్పిస్తున్న సంస్థ సభ్యులు

ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. సమిధ సంస్థ అధ్యర్యంలో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటివకూ సుమారు మూడు జిల్లాల్లో 62 క్యాంపులు ద్వారా 4450 మందికి అవగాహన కల్పించామని సమిధ సంస్థ కార్యదర్శి డి.వీరభద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాగంగా సోమవారం అనంతగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సుమారు 100 విద్యార్థులకు అవగాహన కల్పించి ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు బుద్దు రాజు, సింహాద్రి, అప్పలరాజు, దేముడమ్మ, చంటి, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️