మినరల్‌ వాటర్‌ ప్లాంటు ప్రారంభం

ప్రారంభిస్తున్న ఎంపిపి, జెడ్‌పిటిసి

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మహిళల ఆదాయం పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీపీ ఈశ్వరి, జడ్పీటీసీ సభ్యురాలు జానకమ్మ తెలిపారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయ ఆవరణలో మానవ అభివృద్ధి విభాగం, మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యాన నిర్వహించే మినరల్‌ వాటర్‌ ప్లాంట్ను శుక్రవారం ప్రారంభించారు. సురక్షిత తాగునీటి వ్యవస్థను తీసుకురావడం, మహిళలు ఆదాయం పెంపొందించుకునేందుకు వాటార్‌ ప్లాంట్‌ దోహదపడుతుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలనే లక్ష్యంతో వడ్డీ లేని రుణాలతోపాటు వ్యాపారాలకు ప్రభుత్వం’ చేయూత అందిస్తుందని, దీన్ని సద్వినియోగ పరుచుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆనందరావు, ఎంపీటీసీ సభ్యురాలు గీత, ఎంపీడీవో జయఉమ, ఏపీఎం సూరిబాబు, వైకాపా మండల అధ్యక్షుడు మల్లేశ్వరరావు పాల్గొన్నారు.

➡️