మిరియాల సాగుపై కళాజాతా

అవగాహన కల్పిస్తున్న కళాకారులు

ప్రజాశక్తి-అరకులోయ:ఏజెన్సీలో మిరియాల సాగు పై కాళాజాత కార్యక్రమాల ద్వారా గిరిజన రైతులకు అవగాహన కల్పిస్తున్నామని స్పైసెస్‌ బోర్డు సీనియర్‌ ఫీల్డు అధికారి బొడ్డు కళ్యాణి చెప్పారు. గురువారం చినలబుడు పంచాయతీ తుడుము, దొరవలస గ్రామాల్లో మిరియాల సాగులో సస్యరక్షణ, ఆధునిక వ్యవసాయ పద్దతులు, పరిశుభ్రతపై రైతులకు కళాజాత ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు. ఏజెన్సీలో మిరియాల సాగు మిరింత విస్తరణ,రాయితీపై యంత్రాలు, నాణ్యమైన ఉత్పతిపై గిరిజన రైతులను చైతన్యం చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఉద్యానవన అధికారి కె.శిరీష, చినలబుడు సర్పంచ్‌ బురిడి ఉపేంద్ర, కె.దశరధ రామ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️