మూగజీవాల పట్ల ప్రేమతో మెలగాలి

Jan 25,2024 00:15
మాట్లాడుతున్న చంద్రశేఖర్‌

ప్రజాశక్తి – చింతపల్లి : జంతువుల సంక్షేమం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు డాక్టర్‌ పి చంద్రశేఖర్‌ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జనవరి 15 నుంచి 30వ తారీకు వరకు నిర్వహిస్తున్న జంతుసంక్షేమ పక్షోత్సవాల కార్యక్రమాన్ని చింతపల్లి ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు పి. చంద్ర శేఖర్‌ చింతపల్లి ప్రభుత్వ సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలలో పెంపుడు కుక్కలు, ఇంటిదగ్గర పెంచుకునే ఆవులు, గేదెలు మేకలు, గొర్రెలు. కోళ్లను సంరక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జంతువుల పట్ల క్రూరత్వం ప్రదర్శించేవారికి జంతు సంక్షేమ సంస్థ అధికారి ద్వారా వర్తించే శిక్షలు, జరిమానాలను వివరించారు. కుక్క కాటుతో సంక్రమించే రాబిస్‌ వంటి వ్యాధులకు సంబంధించి వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతి గహ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామరాజు పడాల్‌, వసతి గహ అధికారి సాంబశివరావు, పశు వైద్య సిబ్బంది అప్పారావు నాయుడు, లక్ష్మి, సతీష్‌ అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

➡️