రాష్ట్రంలో అభివృద్ధి ఏదీ? :

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న దొన్నుదర

టిడిపిప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని మఠం పంచాయతీ గ్రామంలో టీడీపి మండల అధ్యక్షులు తులసిరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు ఇన్చార్జి సివేరి దొన్ను దొర తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అభివద్ధిని పక్కనపెట్టి ప్రజాధనాన్ని వృథా చేస్తుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మహిళల కోసం పెద్ద పెట్ట వేసిందని ఆయన గుర్తు చేశారు. గ్రామస్థాయిలో రోడ్లు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిసిసి చైర్మన్‌ తులసీరావు, అప్పారావు, గూడా సర్పంచ్‌ కంబిడి జ్ఞాన్‌ ప్రకాష్‌, పెదలబుడు సర్పంచ్‌ పెట్టేలి దాసు బాబు. మాజీ సర్పంచ్‌ పాడి బాలన్న, అరకు అసెంబ్లీ ఎస్టీ సెల్‌ అధికార ప్రతినిధి శంకర్‌ నాయుడు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.

➡️