రాష్ట్ర బృందం సందర్శించి

రాష్ట్ర బృందం సందర్శించి

ప్రశ్నలు అడుగుతున్న బృందం సభ్యులు

xప్రజాశక్తి-అరకులోయ:మండలంలోని కొత్తభల్లు గూడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో లెర్నింగ్‌ ఇంప్రూవ్మెంట్‌ ప్రోగ్రాం( ఎల్‌ఐపి) రాష్ట్ర బృందం సందర్శించి పరిశీలించారు. తరగతి గదిలో టీచింగ్‌ పీరియడ్‌, ప్రాక్టీస్‌ పీరియడ్లను టీం సభ్యులు పి. ఈశ్వరరావు, సిహెచ్‌ ఎం.దొర పరిశీలించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించి ఎల్‌ఐపి పై సందేహాలను నివృత్తి చేశారు.చదవడం, రాయడం చతుర్విధ ప్రక్రియలో విద్యార్థులు వెనుకబడి ఉండటాన్ని గుర్తించామని, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి మెరుగుదల సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అరకులో ఎంఈఓ భారతిరత్నం, ఏ ఎస్‌ఓ సింహాచలం, హెచ్‌ఎం పద్మ పాల్గొన్నారు.

➡️