విఆర్‌ఒ కృష్ణారావుకు అవార్డు

Jan 28,2024 23:58
అవార్డు అందుకుంటున్న విఆర్‌ఒ కృష్ణారాఉ

 

ప్రజాశక్తి-చింతపల్లి:చింతపల్లి మేజర్‌ పంచాయతీ విఆర్వో సురకత్తి కృష్ణారావు గణతంత్ర దినోత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. కుల, ఆదాయ ధ్రువ పత్రాలను త్వరితగతిన అందించడమే కాకుండా పివిటీజీల సర్వేను వేగవంతంగా చేయడంతో అవార్డు దక్కింతని విఆర్‌ఒ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉత్తమ సేవ పురస్కారం దక్కడంపై ఆనందంగా ఉందని అన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవలు అందిస్తానని తెలిపారు.

➡️