వైసిపి నేతల సంబరాలు

కేక్‌ను తినిపిస్తున్న విశ్వేశ్వరరాజు

ప్రజాశక్తి-జి.మాడుగుల:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తలపెట్టి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో మంగళవారం పాడేరు నియోజకవర్గ సమన్వయ కర్త మత్స్యరాస విశ్వేశ్వరరాజు వైసిపి నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుధీర్ఘంగా రాష్ట్ర నలుమూల నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ కుడుముల సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు నుర్మని మత్యకొండంనాయుడు, ఎంపీటీసీలు పాంగి చిట్టిబాబు, నానాజీ, సర్పంచులు కిముడు రాంబాబు, మాసాడి గంగరాజు, రామక్రిష్ణ, బోడిగి మత్యం నాయుడు, కొండపల్లి సత్యనారాయణ, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్స్‌ పాంగి రామక్రిష్ణ, కన్వీనర్‌ కొర్ర సొంబాబు, సీనియర్‌ నాయకులు ఉల్లి పెద్దబ్బాయి పాల్గొన్నారు,

➡️