ఉపాధ్యాయుడ్ని నియమించరూ..

ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు

ప్రజాశక్తి -అనంతగిరి:సుమారు 20 మందికికి పైగా విద్యార్థులు ఉన్నాం…ఉపాధ్యాయుడిని నియమించాలని మండలంలో ఓ పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాలు…మండలంలోని పైనంపాడు పంచాయతీ పరిధి కాకరపాడు ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు ప్రమోషన్‌తో బదిలీ అయ్యారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పున్ణప్రారంభించినా నేటి వరకు ఉపాధ్యాయుడి నియామకం చేపట్టలేదు. ఆ గ్రామానికి చెందిన సుమారు 20 మందికి పైగా విద్యార్థులు రోజు ఉదయం పూట పాఠశాలకు వస్తున్నారు. ఉపాధ్యాయుడు లేక పోవడంతో ఆటలు ఆడుకుంటూ విద్యార్థులు ఇంటి బాట పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు.మండల విద్యాశాఖ అధికారి బాలాజీని వివరణ కోరగా కాకరపాడు పాఠశాలతో పాటు మండలంలో సుమారు 21 పాఠశాలలకు ఉపాధ్యాయుల కొరత ఉందని తెలిపారు. 11 పాఠశాలలకు వేరే పాఠశాలల నుండి డిప్యూటీషన్‌ కింద తాత్కాలికంగా టీచర్లను నియమించామన్నారు.మరికొన్ని పాఠశాలలకు సర్దుబాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. త్వరలో సర్దుబాటు చేస్తామన్నారు. దీనిపై ఉన్నతాదికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.

➡️