శరవేగంగా రోడ్డు పనులు

నిర్మించిన రహదారి

ప్రజాశక్తి -అనంతగిరి: రోడ్డు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పోరాట పలించింది. దీంతో రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి స్థానిక సిపిఎం జెడ్పిటిసి దీసరి గంగరాజు, స్థానిక సర్పంచ్‌ సోమ్మెల రూతులు రెండు మండలాల సరిహద్దు అనంతగిరి పంచాయతీ పరిధి డెక్కపురం, ఉక్కుంపేట మండలం పట్కాదౌడ పివిటిజి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో పాడేరు కనెక్టివిటీ ప్రాజెక్టు ట్రైబల్‌ వెల్ఫేర్‌ పథకం కింద 2 కోట్ల 40 లక్షల నిధులు 8 నెలల క్రితం మంజూరు అయ్యాయి. కాగా రెండు మండలాల జడ్పిటిసి, ఎంపిపి, సర్పంచుల చేతులు మీదుగా 2023 ఏడాదిలో శిలాఫలకం ఆవిష్కరించారు. రెండు దఫాలుగా శంకుస్థాపన కార్యక్రమాలు చేసినప్పటికీ ఫారెస్ట్‌ ఉన్నతాధికారుల అభ్యంత రాలతో అనుమతులు రాక శంకుస్థాపనలతోనే పనులు నిలిచిపోయాయి. దీంతో జెడ్పిటిసి గంగరాజు మంజూరైన రోడ్డుకు ఫారెస్ట్‌ అనుమతులు ఇవ్వాలని ఉమ్మడి జిల్లా పరిషత్‌ సమావేశంలో అధికారులను నిలదీయడమే కాకుండా లిఖితపూర్వకంగా పిర్యాదు చేశారు. దిగొచ్చిన అధికారులు స్పందించి అనుమతులు జారీ చేయడంతో రోడ్డు పనులు ఈ ఏడాది జనవరి నెలలో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. దీంతో డిక్కపురం, పట్కా దౌవడ పివిటిజి ప్రజలు సిపిఎం ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలపారు.

➡️