శ్రమదానంతో రహదారి పనులు

శ్రమదానంతో రహదారి పనులు

రోడ్డు పనులు చేపడుతున్న గ్రామస్తులు

ప్రజాశక్తి-హుకుంపేట:తుఫాన్‌తో మండలంలోని ఉర్రాడ బొడ్డపుట్టు నుంచి మదనపురం వరకూ రహదారి కొట్టుకు పోయింది. ఈ రోడ్డు పాడైపోవడంతో గ్రామస్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. స్కూల్‌కి పిల్లలు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు ఆ గ్రామానికి అంబులెన్స్‌ వెళ్ళలేదు. ఆసుపత్రికి వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కలకు ఈ రహదారి ఆనుకొని 50 గ్రామాలు ఉన్నాయి. దీంతో, స్థానిక సర్పంచ్‌ సోమెలి సత్యవతి ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు చేపట్టారు.ప్రభుత్వం చొరవ తీసుకుని నూతన రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు అడేరి రాము, తాంగుల రవి, మజ్జి బాలకృష్ణ, మజ్జి రామారావు, మజ్జి చిన్న మజ్జి బాలయ్య, రామారావు, మహేష్‌ కోరారు.

➡️