సంజాయిషీ నోటీసులతో నిరసనలు

Jan 19,2024 00:06
డుంబ్రిగుడలో సంజాయిషీ నోటీసులతో నిరసన చేపడుతున్న అంగన్‌వాడీలు

ప్రజాశక్తి- విలేకర్ల బృందం సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీలు జిల్లాలో సమ్మెను కొనసాగించారు. అధికారులు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులపై సంజాయిషీ ప్రతులను అధికారులకు అందజేశారు. పలు చోట్ల ర్యాలీలు చేపట్టారు. డుంబ్రిగుడ:కేంద్రంలోని హైవే రోడ్డు యూనియన్‌ బ్యాంక్‌ జంక్షన్‌ నుంచి మూడు రోడ్ల జంక్షన్‌ మీదుగా ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు అంగనవాడీలు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కార్మికులకు ఇచ్చిన నోటీసులకు గాను సంజాయిషీ పత్రాలతో నిరసన చేపట్టి ఐసిడిఎస్‌ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కే.కొండమ్మ, సత్యవతి, పవిత్ర పాల్గొన్నారు. అనంతగిరి:మండలంలో అంగన్‌వాడీలు సమ్మెను కొన సాగించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ మండల యూనియన్‌ నాయకురాలు పి.మంజుల, సిహెచ్‌.కళావతి, కె.లక్ష్మీ, ఎస్‌.సుమిత్ర, అరుణ కుమారి పాల్గొన్నారుహుకుంపేట:స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి టీచర్లు చేస్తున్న సమ్మె గురువారం 38వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం అందించిన సమ్మె నోటీసులను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం సమ్మె నోటీసులపై సమాధానాలను స్థానిక సిడిపిఓకు యూనియన్‌ నాయకులు తెలిపారు. ప్రభుత్వం దిగివచ్చి సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించమని ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. అంగన్వాడీ యూనియన్‌ నాయకులు. అప్పలకొండమ్మ, కృష్ణవేణి పద్మ, కుమారి, కార్యకర్తలు పాల్గొన్నారు.ముంచింగిపుట్టు:స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. లక్ష్మీపురం సర్పంచ్‌ కొర్ర త్రినాధ్‌, ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ, ప్రభుత్వం సమస్యలను పరిష్కారం చేయకుండా షోకాజ్‌ నోటీసులు జారీ చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని విమర్శించారు. యూనియన్‌ నాయకులు ఎస్‌.ఈశ్వరమ్మ, ఎస్‌.కాంతమ్మ, మౌళమ్మా, సుజాత, భవాని, సత్యవతి, కుమారి, చిలకమ్మ, అంగన్వాడీలు పాల్గొన్నారు.పెదబయలు: మండలంలో అంగన్వాడీల సమ్మె కొనసాగింది. ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు సమాధాన పత్రాలు ఇచ్చేందుకు వెళ్లగా ప్రాజెక్ట్‌ అధికారిని లేక పోవడంతో సూపర్‌వైజర్స్‌కు అందించారు. ముందుగా సమ్మె ప్రాంగణం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షురాలు టి.రాజమ్మ మాట్లాడుతూ, సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరిం చారు. సీఐటీయూ జిల్లా నాయకులు బోండా సన్నిబాబు, మండల కమిటీ బోండా గంగాధరం, చెట్టి పద్మ, మంగ, కొండమ్మ, సుశీల, శాంతి, తదితరులు పాల్గొన్నారు.షోకాజ్‌ నోటీసులకు సమాధానాలుఅడ్డతీగల: మండల కేంద్రంలో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన 38వ రోజు కొనసాగింది. షోకాజ్‌ నోటీసులపై అంగన్వాడీలు సమాధానాలు ఇచ్చారు. అడ్డతీగల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు.షోకాజ్‌ నోటీసులకు రాతపూర్వకంగా సమాధాన పత్రాలను ఐసిడిఎస్‌ కార్యాలయంలో అందజేసి, రసీదులు పొందారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకట్‌, యూనియన్‌ నాయకులు బి నిర్మల, బేబీ రాణి పాల్గొన్నారు.కూనవరం : మండలంలోని భీమవరం క్రాస్‌ రోడ్డు నుండి ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌ వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి, తమకు ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు సమాధానం రాతపూర్వకంగా అందజేశారు. సిఐటియు నాయకులు కొమరం పెంటయ్య, పూనెం సత్యనారాయణ మాట్లాడుడారు. సీఐటీయూ నాయకులు సుబ్బారావు, పాల్గొన్నారు.రాజవొమ్మంగి : స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం ఎదురుగా సమ్మె శిబిరం వద్ద నుండి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించి, బైఠాయించారు. షోకాజ్‌ నోటీసులకు రాతపూర్వక సమాధానం ఐసిడిఎస్‌ సిడిపిఓ దేవామణికి అందజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి రామరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు టి శ్రీను, యూనియన్‌ నాయకులు కె వెంకటలక్ష్మి, సిహెచ్‌ కుమారి, ఎల్‌ సత్యవతి, రమణి, రమణ, రత్నం, చిన్నమ్మలు సుందరమ్మ, నాగమణి, రాధా, భవాని, రాజేశ్వరి, లక్ష్మి, వీరయ్యమ్మ, వీరలక్ష్మి పాల్గొన్నారు.పిఆర్‌.పురం : మండలంలోని రేకపల్లి జంక్షన్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు దీక్షలు 38వ రోజుకు చేరాయి. శిబిరాన్ని జడ్పిటిసి వాళ్ల రంగారెడ్డి, మాజీ జెడ్పిటిసి ముత్యాల రామారావు, టిడిపి నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అలాగే అంగన్వాడీలకు ప్రభుత్వం షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంపై ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆఫీస్‌ ఎదుట నిరసన తెలిపి, రాత పూర్వక సమాధానం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు సున్నం రంగమ్మ, రాజేశ్వరి, కనకమహాలక్ష్మి పాల్గొన్నారు.మారేడుమిల్లి : నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్‌ నోటీసులకు బదులుగా గురువారం మండలంలోని అంగన్వాడీలు పంచాయతీ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం వద్ద నుండి ఐసిడిఎస్‌ కార్యాలయం వరకు నిరసన ర్యాలీలు నిర్వహించారు. ఐసిడిఎస్‌ సిడిపిఓ ప్రసన్న విశ్వనాధ్‌కి లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చి వారి నుండి నకలు తీసుకున్నారు. అంగన్వాడీలకు జనసేన, టిడిపి నాయకులు మద్దతు తెలియజేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గురుకు శేషు కుమార్‌, రాజ్‌ కుమార్‌, అంగన్వాడీలు పాల్గొన్నారు.కొయ్యూరు : మండల కేంద్రంలో అంగన్వాడీల ఆందోళన 38వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు వై అప్పలనాయుడు మాట్లాడుతూ నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ముత్యాలమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌ సూరిబాబు, అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️