రోడ్డుకు అడ్డంగా భారీ వాహనం

మారేడుమిల్లిఘాటిలో వందల సంఖ్యలో నిలిచిన వాహనాలు. ..
ప్రజాశక్తి-చింతూరు : మారేడుమల్లి ఘాటీలో భారీ వాహనంను రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో చింతూరు మండలం తులసిపాక గ్రామంలో నుండి ఘాటి రోడ్డు వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఆదివారం రాత్రి నుండి ప్రయాణికులు అక్కడే నిలిచిపోయారు. భారీ వాహనాలను ఘాట్ రోడ్లో అనుమతించకూడదని, అడవి మార్గంలో ప్రయాణించే వందల ప్రయాణికులు టూరిస్టులు దానివల్ల ఇబ్బంది పడుతున్నారని గతంలో అధికారులకు తెలిపిన ఫలితం లేకుండా పోయింది. అనేకసార్లు వాహనాలు అడ్డం పడటంతో చిన్నారులతో సహా పసిపిల్లలు తీవ్ర అసౌకర్యానికి గురైన సంఘటనలు ఉన్నాయి. అయినా కానీ అడ్డు అదుపు లేకుండా రాత్రి పగలు వాహనాలు ఇష్టానుసారంగా ఘాట్ రోడ్లో ప్రయాణించటంతో ఈ సమస్య ఎదురవుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు భారీ వాహనాలను ఘాటు పైకి రాకుండా వేరే దారిలో ప్రయాణించేలా రూట్ మ్యాప్ ఏర్పాటు చేసి వాహనాలను మళ్లించినట్లయితే సమస్యను కొంతవరకు పరిష్కారం అవుతుంది. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ కావడంతో భారీ వర్షాలకు ఘాటీలో భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడే ప్రమాదం కూడా ఉంది. అందువలన అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా భారీ వాహనాలను అనుమతించకుండా నిరోధావించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భారీ ప్రాణాపాయం కూడా జరిగే ప్రమాదం ఉంది.

➡️