ప్రజాశక్తి క్యాలండర్ ఆవిష్కరణ 

Jan 1,2024 16:21
anganwadi workers strike 21 day calender

ప్రజాశక్తి-పెదబయలు  :  డా అంబేద్కర్ కూడలి జంక్షన్ వద్ద 20 వ రోజు అంగన్వాడీల నిరాహార దీక్ష సమ్మె కొనసాగింది. ఈసందర్బంగా ప్రజాసంఘాలతో 2024 ప్రజాశక్తి క్యాలండరు ప్రజాసంఘాలచే ఆవిష్కరించారు. అంగన్వాడీలు నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోలేదు. పాలక ప్రభుత్వాలు అంగన్వాడీల డిమాండ్స్ పరిష్కరిస్తేనే నూతన సంవత్సరం వేడుకలుంటాయని పేర్కొన్నారు. ఈనెల ముదున జరిగే పరిమనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సన్నారు. అనంతరం ప్రజాశక్తి కెలండరు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బోండా సన్నిబాబు సీతగుంట సర్పంచ్ పి మాధవరావు, ఎంపీటీసీ కె బొంజుబాబు, టి ఎస్ ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు థాంగుల జగత్ రాయ్, సిపిఎం మండల కమిటీ బోండా గంగాధరం, కె శరబన్న, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్షురాలు టి రాజమ్మ, పద్మ కొండమ్మ సుశీల మంగ తదితరులు పాల్గొన్నారు.

➡️