ఆశా వర్కర్ల రాస్తారోకో 

asha workers protest in alluri

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రమైన రాజవొమ్మంగి అల్లూరి సీతారామరాజు జంక్షన్ వద్ద రహదారిపై శుక్రవారం సీఐటీయు ఆధ్వర్యంలో మండల ఆశా వర్కర్లు రాస్తారోకో నిర్వహించారు. తొలిత స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి అల్లూరు జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు, అల్లూరి జంక్షన్ వద్ద రాస్తారోకో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దగ్గరగా నినదించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పి రామరాజు,ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ అమ్మిరాజు, కె చంద్రావతి, లక్ష్మి శ్రీ తదితరులు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా వర్కర్స్ ను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాలని, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆశా వర్కర్లుకు కనీస వేతనం చెల్లించాలని, ప్రభుత్వ సెలవులు, మెడికల్ లీవ్ వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ఆశా వర్కర్స్ యూనియన్ గురువారం చలో విజయవాడకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో అక్కడకు వెళ్లనివ్వకుండా ఆశా వర్కర్ల గృహ నిర్భందాలు, పోలీసులు వారిని అక్రమంగా అరెస్టులు చేశారని,వారిపై దాడులకు పాల్పడ్డారని ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు ఆశవర్కర్లు ఐక్యంగా సిద్ధపడాలని పిలుపునిచ్చారు,ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు టి శ్రీను, ఆశా వర్కర్ల యూనియన్ మండల నాయకులు, కె చంద్రావతి, కె బాలమ్మ, లక్ష్మి శ్రీ, సీత,భవాని, నూకరత్నం, చెల్లయమ్మ, దుర్గ, సూర్యావతి, ఈ సత్యవతి, పెద్ద సంఖ్యల ఆశ వర్కర్ల పాల్గొన్నారు.

➡️