కెజిబివి విద్యార్థినికి డిఇఒ సన్మానం

Apr 18,2024 00:13
విద్యార్థినిని సన్మానిస్తున్న డిఇఒ, ఎఎంఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన కెజిబివి విద్యార్థిని హరిప్రియను డిఇఒ వి.బ్రహ్మాజీరావు బుధవారం సన్మానించారు. విద్యార్థిని పాడేరు కస్తూర్బా గాంధీ విద్యాలయ పాఠశాలలో ఎంపిహెచ్‌డబ్ల్యూ రెండవ సంవత్సరం చదువుతోంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ రెండవ సంవత్సరం ఫలితాల్లో 1000 మార్కులకు గాను హరిప్రియ 915 మార్కులు సాధించింది. జిల్లాలో 22 మండలాల కెజిబివిల్లో పాడేరు కెజిబివి విద్యార్థిని మొదటి ర్యాంకు సాధించడంపై డిఇఒ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎఎంఒ కె.భాస్కరరావు, కెజిబివి స్పెషల్‌ ఆఫీసర్‌ కళ, ఉపాధ్యాయురాలు కె.శిరీష, తదితరులు పాల్గొన్నారు.

➡️