అభివృద్ధి, సంక్షేమం మాకు రెండు కళ్లు 

ఎమ్మెల్యే శిరీషాదేవి
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ మాకు రెండు కళ్ళనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి, తెలుగుదేశం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి మండలం లోని లబ్బర్తి గ్రామంలో ప్రారంభించారు, సోమవారం ఎన్టిఆర్ భరోసా(పింఛన్లు) లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఇచ్చే కార్యక్రమంలో రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి, తెలుగు యువత అధ్యక్షులు విజయ భాస్కర్ తదితరులు పాల్గొని లబ్బర్తి, దూసరపాము, రాజవొమ్మంగి,జడ్డంగి , అడ్డతీగల మండలంలో రాజుంపాలెం, పాపంపేట అడ్డతీగల, వేటమామిడి, గంగవరం తదితరి మండల గ్రామాల్లో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ దంపతులు మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో వృద్ధులకు 75 రూపాయల పెన్షన్ కార్యక్రమం అప్పట్లో అమల్లోకి తీసుకువచ్చారని సామాన్యులకు వృద్ధులకు వికలాంగులకు అండగా నిలబడి పెద్దపేట వేసిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 75 రూపాయల నుండి 200 పింఛన్ పెంచారని టిడిపి హయాంలో మరల 200 నుండి 2000 రూపాయలు పెంచును పెంచారని, ఇప్పుడు ఏకంగా 4000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. పించన్లు డబ్బు ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చి అవ్వ,తాతలు, వికలాంగుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు, అనంతరం ఎమ్మెల్యే శిరీష దేవి దంపతులు వృద్ధుల నుండి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ, మండల అధ్యక్ష కార్యదర్శులు జి పెద్దిరాజు, ఎం డింబకేశ్వరరావు, టిడిపి జిల్లా నాయకులు దంతులూరి శివరామచంద్రరాజు, మాజీ సొసైటీ అధ్యక్షులు ఘనజాల తాతారావ్, జనసేన, బిజెపి మండల అధ్యక్షులు బి త్రిమూర్తులు, తాము సూరిబాబు,ఆయా మండలాల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు ఎంపీడీవో లోకుల యాదగిరిశ్వరరావు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

➡️