ప్రత్యేక ఉపవాస ఆరాధనలతో గుడ్ ఫ్రైడే

ప్రజాశక్తి-విఆర్ పురం : మండలంలోని సంతపాకల వద్ద సాలెం పేరహౌస్ మందిరంలో సర్వ మానవాళి కోసం సిలువ మరణం పొందిన ఏసుక్రీస్తు ప్రేమను వాత్సల్యాన్ని కొనియాడుతూ, ఏసుక్రీస్తు సిలువ కార్యమునకు కృతజ్ఞతలు తెలుపుతూ గుడ్ ఫ్రైడే సందర్భంగా సాలెం ప్రేయర్ హౌస్ మందిరంలో క్రైస్తవ సోదరి సోదరులు శుక్రవారం ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు. ఉపవాస ప్రార్థనలతో మండలంలో అన్ని చర్చిలలో క్రైస్తవులు ఆరాధన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ఏసుక్రీస్తు ఆత్మార్పణను, సిలువ వేయబడిన తర్వాత ఏసుక్రీస్తు మాటలను, మానవాళి శ్రేయస్సు కోసం క్రీస్తు చేసిన ప్రబోధనలను పాస్టర్లు డేవిడ్ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆరాధన కార్యక్రమాల్లో సుదీర్ఘంగా వివరించారు. సెయింట్ ఆన్స్ చర్చ్ ఫాదర్స్ మరియు సిస్టర్స్ విద్యార్థినీలు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తును ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తూ సాలెం ప్రేయర్ హౌస్ పాస్టర్లు డేవిడ్ లివింగ్ స్టాం గుడ్ ఫ్రైడే పవిత్రతను తెలియజేస్తూ సందేశం ఇచ్చారు ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. 8న ఆదివారం ఉదయం, విఆర్ పురం మండలంలోని కార్యక్రమం, మరియు 31న, ఈస్టర్ సండే ఆరాధన కార్యక్రమాల నిర్వహణకు క్రైస్తవ సహోదరులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

➡️